ఐటీ పార్కు పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తున్న ఎమ్మెల్యే
– డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొంటు సాగర్
గోదావరిఖని యదార్థవాది
అమెరికా పర్యటన పేరుతో రామగుండం ఎమ్మెల్యే నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే పర్యటన వల్ల స్థానిక యువతకు ఎలాంటి ఉపయోగం లేదని డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొంటు సాగర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండం నియోజకవర్గం అనేక పరిశ్రమలతో కేంద్ర బిందువుగా ఉందని,ఐటి పార్కు ఏర్పాటు చేయటం కంటే ముందు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. నిరుద్యోగ యువత మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్థానిక పరిశ్రమలైన ఆర్ ఎఫ్ సి ఎల్, తెలంగాణ పవర్ ప్లాంట్, ఎన్ టి పి సి, ఓ సి పి లలో శాశ్వత ఉద్యోగాలు ఎందుకు కల్పించడం లేదో సమాధానం చెప్పాలన్నారు.ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగాల పేరుతో దళారుల చేతుల్లో మోసపోయిన వారికి ఇప్పటి వరకు ఎందుకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇప్పించ లేదో చెప్పాలనీ డిమాండ్ చేశారు.పోటీ పరీక్షలలో పాల్గొనే నిరుద్యోగ యువతకి ఇప్పటి వరకు లైబ్రరీ దిక్కులేదని, రానున్న ఎన్నికల దృష్ట్యా యువతను తప్పు దోవ పట్టించడానికి ఐటీ పార్కు పేరుతో ఎమ్మెల్యే పర్యటనలు చేస్తున్నాడని విమర్శించారు.