జగిత్యాలలో అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. పట్టణంలోని తీన్ కానీ చౌరస్తాలో ముగ్గురు యువకుల పై కొంతమంది కత్తులతో దాడి చేశారు . ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాగా ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది . ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.