కాంగ్రెస్ నమ్ముకుంటే ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేస్తారు: మంత్రి హరీష్
గజ్వేల్ యదార్థవాది ప్రతినిది
ములుగు మండలం బండ మైలారం పారిశ్రామిక వాడలో 33/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్ ను ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బండ మైలారం గ్రామ రూపురేఖలు మార్చింది సీఎం కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలతో వస్తుందని ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేస్తారని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గజ్వేల్ నియోజకవర్గం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నామని ఆయన అన్నారు. గజ్వేల్ ప్రాంతంలో నెలకొన్న 50 ఏళ్ళ నీటి కష్టాన్ని కేసీఆర్ తొలగించారని, దేశంలో గజ్వేల్ పేరు, ప్రతిష్ట నిలబెట్టిన ఘనత సాధించారని ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో మన కేసీఆర్ ను గెలిపించాలని గ్రామ ప్రజలకు మంత్రి హరీశ్ పిలుపు నిచ్చారు.