కారెక్కిన మోత్కు

304
కారెక్కిన మోత్కు
సీనియర్ నాయకులు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మోత్కుపల్లి నర్సింహులుకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మోత్కుపల్లి తనకు ఉన్న రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మోత్కుపల్లికి ఎంతో రాజకీయ అనుభవం ఉందని, తనతో కలిసి పలు శాఖల్లో పని చేశామని అన్నారు. టిడిపి హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో విద్యుత్ కోతలు ఎలా వుండేవో తెలిసిన వాడన్నారు. నీళ్ల కోసం ప్రజలు పడుతున్న కష్టాలు ఆయనకు తెలియంది కాదన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కొక్కటిగా ప్రతి సమస్యను పరిష్కరించుకుంటున్నామని చెప్పారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కే కేశవరావు, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి