27 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్తెలంగాణకార్మికుల పట్ల చిన్నచూపు తగదు: బీజేపీ

కార్మికుల పట్ల చిన్నచూపు తగదు: బీజేపీ

కార్మికుల పట్ల చిన్నచూపు తగదు: బీజేపీ

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అనుకుంటే కేవలం కేసిఆర్ కుటుంబం మాత్రమే రాజభోగాలు అనుభవిస్తూ, గ్రామా పంచాయతి కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపుసురేందర్ రెడ్డి అన్నారు.. శనివారం హుస్నాబాద్ ఎంపిడిఓ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తుంన్న గ్రామా పంచాయతి కరోబారులు, కార్మికులకు శిబిరానికి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కారోబారులు కార్మికులు తమ 17 సమస్యలు పరిష్కరించాలని న్యాయమైన డిమాండల కోసం 10 రోజులుగా సమ్మె నిర్వహిస్తుంటే కనీసం స్పందించకుండా, నిర్లక్ష్యం చేయడం దారుణమని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కర్మికులతరుపున బీజేపీ పార్టి తరుపున కోట్లడుతుందని తెలిపారు. ఈ సమస్యను ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, అక్కన్నపేట మండల అధ్యక్షులు గోళ్లపల్లి వీరాచారి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నునవత్ మోహన్ నాయక్, పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు అనిల్ నాయక్, ప్రధాన కార్యదర్శి రైనా నాయక్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్