కేంద్ర నిధులతో అభివృద్ధి జరిగింది: రాణి రుద్రమ దేవి
-సిరిసిల్ల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా..
-ధరణితో రైతుల భూములు గుంజుకున్న కేసీఅర్ ప్రభుత్వం..
సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది
రాష్టం అభివృద్ధి పనులకు నిధులు కేంద్ర ప్రభుత్వానివేనని రాణి రుద్రమదేవి అన్నారు.. సోమవారం సిరిసిల్ల పట్టణంలోనీ బివైనగర్ లో ఎన్నికల ప్రచారంలో బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ దేవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు, సిసి రోడ్ల నిర్మాణం, వీధిలైట్లు, రేషన్ బియ్యం, హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం వీటన్నిటికీ నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు జరిగిన మోదీ ఇచ్చే నిధులవల్లే జరుగుతుందని, 40సంత్సరాల కింద ఇచ్చిన ఇళ్ల స్థలాలకు కనీసం రిజిస్ట్రేషన్ చేయలేని అసమర్ధ మంత్రి కేటిఆరేనని అన్నారు..తెలంగాణ లో తెరాస ప్రభుత్వం రాగానే ధరణి అని పెట్టి రైతులకు అన్యాయం చేశారని, అసైండ్ భూములు, పేద లకు ఇచ్చిన భూములు పేదల వద్ద భూములు కూడా లాక్కునెందుకు ఈ ధరణి పెట్టినరాని తెలిపారు. బీజేపీ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఇళ్ల స్థలాలకు, రిజిస్ట్రేషన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాని ఆమె అన్నారు. కార్యక్రమం లో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, కౌన్సిలర్ లు బోల్గం నాగరాజు, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు కైలాష్, శ్రీనివాస్, ఎనగంటి నరేష్, కొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.