కేసీఆర్ తీవ్ర గాయం.. ఆసుపత్రిలో చేరిక
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిది
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన ఇంట్లో కాలు జారి పడటంతో గాయమైనట్లు సమాచారం.
కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.