గర్భిణీ స్త్రీల కు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ
హుస్నాబాద్ యదార్థవాది
హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందచేసిన మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, ఆస్పత్రి సూపర్డెంట్ రమేష్.. ఈ సందర్భంగా చైర్ పర్సన్ ఆకుల రజిత మాట్లాడుతూ మహిళల్లో రక్తహీనత పోషక ఆహార లోపాలను తగ్గించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, ఆరోగ్యమే మహాభాగ్యమని నినాదంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మన స్త్రీల కోసం ఈ న్యూట్రిషన్ కిట్లు ప్రవేశపెట్టారని వారికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉండాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, 1 వ వార్డు కౌన్సిలర్ కొంకటి నళినీ దేవి, గర్భిణీ స్త్రీలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు..