గవర్నర్ తీరుతో ప్రజలు నవ్వుకుంటున్నారు.
కొండపాక యదార్థవాది
అసెంబ్లీలో తమిలసై సౌందర్య రాజన్ గవర్నర్ ప్రసంగించిన పద్ధతి ఏమాత్రం బాగాలేదని అత్యున్నత స్థానం లో ఉండి ఇలా మాట్లాడ్డంచూసిన తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని శుక్రవారం దుద్దెడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో కొండపాక బీఆరెస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్ అన్నారు. గవర్నర్ ప్రసంగం అంటే బాధ్యతతో కూడిన సమాలోచనలు సమానత్వం నిండి ఉండాలి కాని కాంగ్రెస్ పార్టీ నాయకులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టు లాగా ఉందని గత పది సంవత్సరాల బీఆరెస్ పాలనలో అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడిన కేసీఆర్ పాలనను గవర్నర్ తమిళసై తప్పుపట్టడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నుండి ఇప్పటివరకు రైతులకు రైతుబంధు రాలేదని కెసిఆర్ సంక్షేమ పథకాలను పేర్లు మార్చడం తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేరే సాధించేది ఏమీ లేదని పేరు గొప్ప ఊరు దిబ్బ అనే విధంగా కాంగ్రెస్ పాలన ఉందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ మల్లమారి రవీందర్ సోషల్ మీడియా అధ్యక్షుడు పాతకోటి లింగం ఆత్మ కమిటీ డైరెక్టర్ సున్నం భాస్కర్ వార్డ్ సభ్యులు సాదుపల్లి కనకసేన గౌడ్ యువజన విభాగం అధ్యక్షులు చిక్కుడు భాను ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్లె బాబు ఎస్టీ విభాగం అధ్యక్షులు కెమ్మసారం శ్యామ్ మైనార్టీ విభాగం మహమ్మద్ ముగ్ధుమ్ బసవరాజు నవీన్ చంద్ ఎండి నయుముద్దీన్ కెమ్మసారం సంతోష్ మెరుగు శివ శ్రీధర్ భరత్ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.