గుర్తు తెలియని మృతదేహం
కుక్కునూరుపల్లి యదార్థవాది
సిద్ధిపేట జిల్లా కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న కిష్టాపూర్ గ్రామ శివారులో ఉన్నటువంటి మర్రి శేరి కుంట ఎవరో గుర్తు తెలియని వ్యక్తి శవం నీటిలో తేలడంతో అది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ తరలించారు. మృతుని వయస్సు సుమారు 32 సంవత్సరాలు ఎత్తు: 5′ అడుగుల చామనచాయ రంగు నలుపు షార్ట్ నలుపుచుక్క వేసుకొని ఉన్నాడు. ఈ క్రింది ఫోటోలోని గుర్తుతెలియని మృతుడిని ఎవరైనా గుర్తు పట్టిన చో డయల్ 100 లేదా కుకునూరుపల్లి ఎస్ఐ మొబైల్ నెంబర్- 8712667345 సమాచారం అందించలని పోలీసులు తెలిపారు.