గ్రామల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: ఎమ్మెల్యే సతీష్
యదార్ధవాది హుస్నాబాద్ ప్రతినిది
కోహెడ మండలంలో రెండు కోట్ల 66 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్.. హుస్నాబాద్ నియోజకవర్గ కోహెడ మండలం పలు గ్రామాలలో సోమవారం నూతన గ్రామ పంచాయతీ భవనాలు,సీసీ రోడ్లు వివిధ అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల 66 లక్షలు నిధుల తో శంకుస్థాపనలు చేసి మాట్లాడుతూ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ రాష్ట్రంలో సిద్దించిందని గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. సిసి రోడ్లు, మురికి కాలువలు, మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మిస్తోందని, గ్రామ అభివృద్ధికి నెల నెల నిధులు మంజూరు చేస్తుందని దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాలు వెనుకబడి పోయి అంధకారం తలపించిన, స్వరాష్ట్రం సాధించిన తర్వాత బంగారు తెలంగాణ ధ్యేయంగా కేసీఆర్ పాలనలో ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, జెడ్పిటిసి శ్యామల, ఎంపీపీ కీర్తి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు