ఘనంగా ఎల్లమ్మ బోనాలు
రామగిరి యదార్థవాది
రామగిరి మండల పరిధిలోని రామయ్యపల్లిలో ఆదివారం ఎల్లమ్మదేవి బోనాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా గ్రామంలోని వీధుల గుండా ఊరేగించి గ్రామ దేవత ఎల్లమ్మతల్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. రామగిరి ఎంపీపీ ఆరెళ్ళి దేవక్క కొమురయ్య గౌడ్ దగ్గరుండి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి కరుణా కటాక్షములు గ్రామ ప్రజలకు ఎల్లవేళల అందాలని కోరినట్లు తెలిపారు. ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండాలని సర్వాయి పాపన్న గౌడ్ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని గీత కార్మికులంతా ఒకే తాటి మీదికి రావాలని పార్టీలకు అతీతంగా గౌడ్ అంటే సర్వాయి పాపన్న సాసాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవుని రజిత శ్రీనివాస్, గౌడ సంఘ0 అధ్యక్షులు ఆరెల్లి శ్రీనివాస్ గౌడ్, సిరి శెట్టి, అశోక్, కోయడ కిషోర్ గౌడ్, పూదరి శ్రీనివాస్ గౌడ్ గ్రామంలోని ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..