
ఘనంగా కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సం..
హైదరాబాద్ 28 డిసంబర్
కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా గాంధీ భవన్‌లో పార్టీ జెండాను ఎగరవేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..
ఇసందర్భంగా మాట్లాడుతూ దేశం, రాష్ట్రం ప్రమాదంలో ఉందని..ఈ సమయంలో వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల కోసం పోరాడాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ ఉందని, రాహుల్ గాంధీ దేశ భద్రతకు ముప్పుందని కేంద్రానికి తెలిపిన, బిజెపి ప్రభుత్వానికి పట్టడం లేదని తెలిపారు. ‘‘దేశాన్ని ముప్పు నుంచి కాపాడేందుకే.. మహాత్ముడి స్ఫూర్తితో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు.. రాహుల్ పాదయాత్ర మోదీ భయంతో కొవిడ్ రూల్స్ తీసుకొచ్చారని, దేశ సమగ్రతను సంపదను పెత్తం దారులకు దార దతం చేయాలని భాజపా పార్టి కుట్రలు చేస్తోందని అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులకు దోచుకున్నారు, ఇప్పుడు దేశం దోచుకోవాలని చుస్తోన్నారని అని రేవంత్ రెడ్డి అన్నారు.
