ఘనంగా చత్రపతి సాహుమహారాజ్ జయంతి
హుస్నాబాద్ యదార్థవాది
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు వేల్పుల రాజు ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ కేంద్రంలో రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి డేగల వెంకటేష్ మాట్లాడుతూ సామాజిక న్యాయం అమలుకు 28 ఏళ్ల వయసులోనే తన రాజ్యంలో బ్రాహ్మణేతరులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి సమాన అవకాశాలకు పునాదులు వేసిన మహనీయులు చత్రపతి సాహు మహారాజు విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విద్యాసంస్కరణ కమిటీ ఏర్పాటు చేసి 1917 లోనే ఉచిత నిర్బంధ విద్యా అమలు చేశారని, అంతేకాకుండా తన రాజ్యంలో కులాంతర మతాంతర వివాహాల చట్టం తీసుకువచ్చి ప్రజాస్వామ్య విలువలకు పునాదులు వేశారు హిందూ పిల్లల జోగిని వ్యవస్థను నిరోధించే చట్టం తెచ్చి వివక్ష అంటరానితరం నిషేధించి కొల్లాపూర్ సంస్థానాన్ని ఎన్నో మిగతా రాజ్యాల కంటే ఆధునిక భావాలతో అభివృద్ధి పదంలో నడిపారని అన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఎలగందుల శంకర్, ప్రధాన కార్యదర్శి తొందూర్ సాయి, తేజ, నియోజకవర్గ కార్యదర్శి మైల తిరుపతి, నియోజకవర్గ ఈ సి మెంబర్స్ మారపల్లె సుధాకర్, జేరిపోతుల రవీందర్, హుస్నాబాద్ అధ్యక్షుడు దుండ్రా రాంబాబు, మల్లంపల్లి సెక్టార్ అధ్యక్షుడు సంచల విక్రం, సుధాకర్, కిషన్, తదితరులు పాల్గొన్నారు..