ఘనంగా వాసవి మాత దేవాలయంలో సామూహిక కుంకుమార్చన
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 28: జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాలను పురస్కరించుకొని 2వరోజు మంగళవారం సామూహికంగా మహిళలతో కుంకుమార్చన కార్యక్రమం ఘఘనంగానిర్వహించారు.ఈ సందర్భంగా సుమారు120 మంది మహిళలు ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన కార్యదర్శి ఈగ వెంకటేశ్వర్లు, వాసవి మాలాధారణ నిర్వాహకులు పబ్బతి వేణుమాధవ్, కల కోట లక్ష్మయ్య మాట్లాడుతూ ఈనెల 31న వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకొని ఐదు రోజులపాటు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2వ రోజు కుంకుమార్చనలు, వాసవి మాత పారాయణం, లలితా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించినట్లు తెలిపారు. నేడు బుధవారం 102 కలశములతో మాలధారణ స్వాములతో శోభాయాత్ర నిర్వహించి శ్రీ వాసవి మాతకు మహా అభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 30న పెద్ద ఎత్తున సాయంత్రం శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు. భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శించుకుని తరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ పివిసి అధినేత మీలా మహదేవ్, తోట శ్యాంప్రసాద్, పోలా రాధాకృష్ణ, వెంపటి శబరినాథ్, ఈగ దయాకర్, బిక్కుమల్ల కృష్ణ, నూక రవిశంకర్, మంచాల శ్రీనివాస్, రాచకొండ శ్రీనివాస్, గుండా శ్రీధర్, రాచర్ల కమలాకర్, తోట రమేష్, మీలా వంశీ, బజ్జూర్ శ్రీనివాస్, డోగుపర్తి ప్రవీణ్, గుమ్మడవెల్లి శ్యామ్, యామ సంతోష్, వంగవీటి రమేష్, సింగరకొండ ప్రదీప్ కుమార్, ఉప్పలంచు కృష్ణ, చిలుకల స్వాతి శ్రీనివాస్, సింగిరికొండ కరుణశ్రీ, దేవరశెట్టి ఉమారాణి, తెడ్లపల్లవి, లకుమారపు పద్మ, తెడ్ల రాధిక, పోలా సుధామని, కలకోట అనిత, తేడ్ల పల్లవి, ఉప్పలంచు హైమావతి తదితరులు పాల్గొన్నారు.
