ఘనంగా వెంకట్రావుపేట వెంకటేశ్వర స్వామి జాతర
దుబ్బాక, యదార్థవాది ప్రతినిధి, జనవరి 29: వెంకటేశ్వర స్వామి దయతో ప్రజలంతా పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియెజికవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తొగుట మండలంలోని వెంకట్రావుపేట లో జరిగిన వెంకటేశ్వర స్వామి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాఘఅమావాస్య సందర్బంగా ఏటా ఇక్కడ జాతర నిర్వహించడం అనవాయితీగా వస్తుందని, వెంకటేశ్వర స్వామి జాతర కోసం వేలాది మంది భక్తులు తరలి రావడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు..ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంధారి లత నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షడు అక్కం స్వామి, మాజీ సర్పంచ్ సీలివెరీ రాంరెడ్డి, వెంకటేషం, తోగుట ప్రెస్ క్లబ్ అధ్యక్షడు సాయి, నాయకులు ఎన్నo భూపాల్ రెడ్డి.పంది రాజు, బెజ్జనబోయిన అనిల్.రాములు గ్రామ పార్టీ అధ్యక్షులు ఒళపు నారాయణ, మండల అధ్యక్షులు ప్రవీణ్, జంగాపల్లి ఆంజనేయులు, బరేంకల స్వామి, పంది నాగరాజు, కలేపు రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మహమ్మద్ షఫీ, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.