విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్ సి సి ఎస్ చక్కెర కర్మాగారం వద్ద నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో సమస్య తీవ్రమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కర్మాగారం నుంచి రైతులకు రావలసిన రూపాయలు 16.38 కోట్లు ఇప్పించేలా చూడాల్సిన పాలనా యంత్రాంగం ఈ సమస్యను శాంతి భద్రతల అంశం గా చూడటం భావ్యం కాదని అన్నారు. రైతులకు వారి జీవితాల్లో దీనికి బదులు చేదు నిండిందని ఆవేదన వ్యక్తం చేశారు.