జగన్మోహన్ రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యం.
అనకాపల్లి యదార్థవాది ప్రతినిది
అనకాపల్లి జిల్లా చోడవరం శాసనసభ నియోజకవర్గంలో శుక్రవారం రావికమతం మండలం చీమలపాడు సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్ కు జగనన్నే ఎందుకు కావాలి అనే కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావికమతం మండల పరిషత్ ఎంపీపీ పైలరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తయ్యాయని రైతు భరోసా అమ్మబడి ఆసరా పెన్షన్లు గృహ నిర్మాణం నాడు నేడు వంటి సంక్షేమ పథకాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ని గెలిపించుకోనే బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భవాని ప్రసాద్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బంటు సన్యాసినాయుడు మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి నాయుడు కన్వీనర్ కంచిపాటి జగ్గారావు కోఆప్షన్ ఎంపీటీసీ గాలి రమణ బాబు స్థానిక సర్పంచ్ వంజరి గంగరాజు ఎంపీటీసీ చిన్ని చిన్నమ్మలు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.