జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ న్యూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బానోతు హనుమంతు నాయక్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా అందరికీ ఇండ్ల స్థలాలు కేటాయిస్తూ దానితోపాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే హుస్నాబాద్ లో ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించి భవనాన్ని నిర్మించాలని తెలంగాణ వస్తే తమ బ్రతుకులు మారతాయని అనుకుంటే కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టుల బతుకులు అగాంచేసిందని నిజాన్ని రాస్తే జర్నలిస్టుల గొంతు నొక్కారని ఎల్లవేళలా ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చేరవేసే ఈ వృత్తిలో అందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయమే చేసిందని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకుంటుందని ఆశాభావంతో ఉన్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ మాగోడు ప్రభుత్వానికి తెలిపి మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కె రవీందర్, ఉపాధ్యక్షులు అక్రమ్ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి టాకూర్ నర్సింగ్ మాటూరు గోపి పచిమట్ల శివ వేణు జగదీశ్ పెరుమాండ్ల భరత్ అనిల్ పున్న శంకర్ టీనా రవి ముతోజు శంకర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.