జర్నలిస్టుల ఐక్యత కోసం డిజెయు కృషి
విజయవాడ యదార్థవాది ప్రతినిది
వృత్తిపరంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర ఐక్య పోరాటాలు అవసరమని డిజెయు జాతీయ కోఆర్డినేటర్ బి ఎన్ చారి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని స్వాతంత్రం సమరయోధుల భవనంలో జర్నలిస్టు మిత్రులతో డిజెయు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిఎన్ చారి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు అపరిషృతంగా ఉన్నాయని, ఐక్యత కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని యూనియన్లు సమస్యల పరిష్కారం కోసం చేయవలసిన స్థాయిలో ఉద్యమాలు చేయలేదని విచారం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంఖ్య పెరిగిందని, యూనియన్ల ఆవశ్యకత మరింత పెరిగిందని, సమస్యలు అధికంగా ఉన్నాయని, అందువలన దేశవ్యాప్తంగా బలమైన యూనియన్ అవసరమని తెలిపారు. జాతీయ నాయకులు కృష్ణం రాజు మాట్లాడుతూ దేశంలోని మహారాష్ట్ర, కర్నాటక,, ఒరిస్సా రాష్ట్రలలో కూడా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. డిజెయు రాష్ట్ర కోఆర్డినేటర్ లు మరీదు ప్రసాద్ బాబు మాట్లాడుతూ యూనియన్ల ఆవశ్యకత ఎప్పటికీ అవసరమేనని, సమస్యల పరిష్కారం కోసం దీర్ఘకాలిక పోరాటం అవసరమని వివరించారు. ఐక్యత, సంక్షేమం, సామాజిక అభివృద్ధి కోసం, జర్నలిస్టుల వ్యక్తిత్వ వికాసం కోసం, జీవనం కోసం యూనియన్ గా పోరాటం అవసరమని వివరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణాజిల్లా నాయకులు సత్యనారాయణ బాలకృష్ణ శ్రీహరి చలపతి వీరులు కృష్ణా కె.శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు కూడా పాల్గొని సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం అవసరమని తెలిపారు. అధిక సంఖ్యలో జర్నలిస్టులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.