జాతిపిత వర్ధంతి
యదార్థవాది ప్రతినిది సిరసిల్ల
దేశ స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ, గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో రెండు నిమిషాల పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహాజన్ మాట్లాడుతూ భారతదేశం కోసం, ఎందరో ద్యగాదనులతో నేడు ప్రజలకు స్వేచ్చ స్వాతంత్య్రం కల్పించడం జరిగిందని, వేలాది మంది స్వాతంత్ర పోరాటంలో పాలుపంచుకొని తమ ప్రాణాలను సైతం అర్పించారని, వారి త్యాగ ఫలితంగానే నేడు మనమంతా ఆ ఫలాలను అనుభవిస్తున్నామని తెలిపారు. అలాంటి త్యాగధనులను స్మరించుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, అడ్మినిస్ట్రేషన్ అధికారి హమ్మదుల్లా ఖాన్, సి.ఐ ఉపేందర్, పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/01/34-2-1024x547.jpg)