జాతీయ స్థాయి డాన్స్ పోటీలకు కెఎల్ యు విద్యార్ధిని ఎంపిక.
ఆంధ్రప్రదేశ్ యదార్థవాది ప్రతినిధి
జాతీయ స్థాయి డాన్స్ పోటీలకు కెఎల్ యు విద్యార్ధిని శృతి సమన్వి కాకర్లపూడి ఎంపికయినట్లు కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ డీన్ డాక్టర్ సిహెచ్.హనుమంతరావు బుదవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. వర్శిటీలో లిబరల్ ఆర్ట్స్ కింద బిబిఎ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని శృతి సమన్వి కాకర్లపూడి సాక్ లోని డాన్స్ క్లబ్‌లో క్రియాశీలక సభ్యురాలు అని ఆయన అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన 37వ సౌత్ జోన్ ఇంటర్-యూనివర్శిటీ యూత్ ఫెస్టివల్ 2023-24లో క్లాసికల్ డ్యాన్స్ విబాగంలో ఆమె జాతీయ స్థాయిలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుందని అన్నారు. ఈ నేపద్యంలో ఆమె ఈ ఏడాది మార్చినెలలో లూథియానాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపియినట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఎపి తరుపున శృతి సమన్వి కాకర్లపూడి ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు. ఈ సందర్బంగా శృతి సమన్వి కాకర్లపూడికి కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయ అద్యాపకులు విద్యార్దులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వర్శిటీ వైస్ చాన్సులర్ డాక్టర్ జి.పార్ధసారధివర్మ ప్రో వైస్ చాన్సులర్లు డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్ డాక్టర్ ఎన్.వెంకట్ రామ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు విద్యార్ది సంక్షేమ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్.హనుమంతరావులు శృతి సమన్వి కాకర్లపూడిని అభినందించారు.