జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు పెరిగాయి: జిల్లా కలెక్టర్
యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రనికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాస్) సర్టిఫికెట్ వచ్చిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హర్షం వ్యక్తం చేశారు.. ఇదివరకే జిల్లాలో వేములవాడ తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికెట్ రాగా ఇటీవలే కోనారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రనికి కూడ ఎన్‌క్వాస్ గుర్తింపు దక్కిందని తెలిపారు. జిల్లాలో వైద్య ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పడానికి మరో నిదర్శనమని నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్సీ) నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను చేరుకొంటే ఎన్‌క్వాస్ సర్టిఫికెట్ వస్తుందని దీనికి మూడేండ్ల వ్యాలిడిటీ ఉంటుందని జిల్లా ప్రజలకు పీహెచ్‌సీ స్థాయి నుంచే నాణ్యమైన వైద్యం అందుతున్నదని చెప్పడానికి కేంద్రం ఇచ్చిన ఈ గుర్తింపు ఒక నిదర్శనమని అన్నారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. మంత్రి కే తారక రామారావు ప్రత్యేక చొరవతో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు పెరిగాయని విలువైన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయని ఓపీ ఐపీ సర్జికల్ ఇలా అన్ని విభాగాల్లో నాణ్యత పెరిగిందని జిల్లా కలెక్టర్ అన్నారు.