32.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణజిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలి: ఎమ్మెల్యే రోహిత్

జిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలి: ఎమ్మెల్యే రోహిత్

జిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలి: ఎమ్మెల్యే రోహిత్

రెవెన్యూ అటవీశాఖ ఎక్సైజ్ శాఖ మైనింగ్ అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష..

అటవీ భూముల ఆక్రమణలు నిర్మూలించాలి..

ప్రైవేటు పరిశ్రమలు ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకంలో స్థానికులకే అవకాశం కల్పించాలి..

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు..

మెదక్ యదార్థవాది ప్రతినిది

జిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మెదక్ నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ అటవీశాఖ ఎక్సైజ్ శాఖ మైనింగ్ అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు జిల్లాలోని చాలా పట్టణాలు గ్రామాలలో యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారారని ఇక మీదట యువత అలా మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాల్సిన అవసరం ఉందని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాలైన అల్ఫాజోలం గంజాయి డ్రగ్స్ రవాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. జిల్లాలోని అన్ని చెక్పోస్టుల వద్ద ఎక్సైజ్ పోలీస్ అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి గట్టి నిగాను ఏర్పాటు చేసి అక్రమ రవాణా జరగకుండా చూడాలని అన్నారు. అటవీ భూములు ఆక్రమణ కాకుండా అటవీశాఖ రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా పనిచేయాలని జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా మైనింగ్ రెవెన్యూ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని పరిశ్రమలు ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో స్థానిక యువకులకే ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడి జయరాజు డి ఎఫ్ ఓ రవిప్రసాద్ మెదక్ ఆర్ డి ఓ అంబదాస్ రాజేశ్వర్ నియోజకవర్గ పరిధిలోని అటవీశాఖ రెవెన్యూ శాఖ ఎక్సైజ్ శాఖ అధికారులు తాసిల్దారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్