జిల్లాలో శాంతిభద్రతల సంరక్షణకై కృషి చేయాలి: జిల్లా కలెక్టర్
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
సిద్దిపేట జిల్లా పోలిస్ కమిషనర్ గా బాద్యతలు చేపట్టిన 2017 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన డాక్టర్ బి.అనురాధ బాద్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె ఇదివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ డిసిపిగా విధులు నిర్వర్తిస్తు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలిపై సిద్దిపేట కమిషనర్ గా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల సంరక్షణకై కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కమిషనర్ కు సూచించారు. ఇది వరకు కమిషనర్ ఆప్ పోలిస్ గా పనిచేసిన ఎన్.శ్వేత బదిలీపై హైదరాబాద్ సిసిఎస్ డిసిపిగా వెళ్లారు.