జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన జోన్- 3 డిఐజి
యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన జోన్- 3 రాజన్న రేంజ్ డిఐజి రమేష్ నాయుడు జిల్లా ఎస్పీ బి. శ్రీనివాస రెడ్డి అదనపు ఎస్పీ J అన్యోన్య పుష్పగుచ్చం సమర్పించి స్వాగతం తెలిపారు. తదుపరి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతరం పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వెంటనే స్పందించి సహాయపడాలని అప్పుడే పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుందని తెలియజేశారు. పోలీస్ శాఖ ఉద్యోగం (యూనిఫామ్ సర్వీస్) చాలా ఉన్నతమైనదని అందుకనే ప్రతి ఒక్క పోలీస్ అధికారి తన వంతు బాధ్యతగా సక్రమంగా విధులు నిర్వహించి బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చిన వెంటనే వారి సమస్యలను క్లుప్తంగా విని అతి త్వరగా సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ సూచించడం జరిగినది. ఈ సమావేశానికి జిల్లాలోని ఎస్ఐలు, సిఐలు కామారెడ్డి బాన్సువాడ ఎల్లారెడ్డి డీఎస్పీ పాల్గొన్నారు.