జిల్లా బాలల సంరక్షణ కమిటీ సమావేశం: జిల్లా కలెక్టర్
యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలోని అనాధలైన చిన్నారులకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను మండల స్థాయి అధికారులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లో గురువారం జిల్లా బాలల సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు అనాథలైన చిన్నారులకు సంబంధించిన భూ, గృహ సమస్యలను పరిష్కరించడానికి అన్ని శాఖల అధికారులు సహకారం అందించాలని తెలిపారు. జిల్లాలో 365 మంది అనాధ పిల్లలను పాఠశాలల్లో చేర్పించినట్లు చెప్పారు. వారికి గురుకుల పాఠశాలలో చేర్పించడానికి రిజర్వేషన్ ఉన్నందున అనాధ చిన్నారులుగా గుర్తింపు కార్డులను ఆయా మండలాల అధికారులు అందజేయాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మెంబర్ స్వర్ణలత, జిల్లా బాలల పరిరక్షణ అధికారిని స్రవంతి, అధికారులు పాల్గొన్నారు.