జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి..రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల 23 డిసెంబర్ 22
23 డిసెంబర్ 22 జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి ఆదేశాలను సారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీం లో వైద్యాధికారి (Contractual basis) బస్తి దావకానాలు నియామకం కొరకు తేదీ. 24 డిసెంబర్ 22 నుండి 29 డిసెంబర్ 22 , సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆసక్తిగల అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించబడును. పోస్ట్ 1. మెడికల్ ఆఫీసర్. విద్యా అర్హతలు ఎంబీబీఎస్, ఎండి తెలంగాణ బోర్డ్ లో తప్పకుండా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి… మీ పూర్తి బయోడేటా మరియు సంబంధిత జిరాక్స్ కాపీలు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం సిరిసిల్లలో అందజేయగలరని కోరనైనది….. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి రాజన్న సిరిసిల్ల