23.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
హోమ్తెలంగాణట్రాన్స్ ఫార్మర్ ల దొంగల అరెస్ట్

ట్రాన్స్ ఫార్మర్ ల దొంగల అరెస్ట్

ట్రాన్స్ ఫార్మర్ ల దొంగల అరెస్ట్

యదార్థవాది ప్రతినిది పెద్దపల్లి

మంథని పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ నిందితుల అరెస్ట్ వివరాలను తెలియచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంథని మండలం ఎక్లాస్పూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన మడిపెల్లి సాయి తేజ, దోనిపల్లి సురేష్, మీనుగు మల్లేష్, రేగుంట వర్ధన్, చిప్పకుర్తి రాకేష్, పులి సిద్దు @ బరద్వాజ్, బానేష్ ఇద్దరు మైనర్స్ లను అదుపులోకి తీసుకున్నారని, వారి వద్ద నుండి మూడు జిల్లాలలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు దొంగలించిన 2.70 క్వింటాళ్ల కాపర్ వైర్, ఉపయోగించిన వాహనం స్వాధీనం చేసుకొని విచారించమని తెలిపారు. నిందితులు 9 మంది ముఠా గా ఏర్పడి రెండు గ్రూపులుగా విడిపోయి పెద్దపల్లి జిల్లా, జయ శంకర్ భుపాలపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా లలో (62) విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చోరీ చేసి అందులోని కాపర్ వైర్ ను అమ్ముకున్నట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు. కొన్ని నెలలుగా పెద్దపెల్లి జిల్లా మరియు మంచిర్యాల లలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ల చోరీలు పెరగడంతో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి (డిఐజి) ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్, మంథని సీఐ సతీష్ లు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లపై దృష్టి సారించారన్నారు. ఈ క్రమంలోనే ట్రాన్స్ ఫార్మర్ చోరీకి పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలని ప్రజలను డీసీపీ తెలిపారు. ఈ పత్రిక సమావేశంలో ఏసీపీ గిరి ప్రసాద్, సిఐ సతీష్, ఎస్సై వెంకటేశ్వర్, రవి ప్రసాద్ పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్