డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాగి నడిపిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. అయితే మద్యం సేవించిన వ్యక్తికి వాహనం నడిపేందుకు అనుమతి ఇవ్వవద్దని, అతని వెంట తాగని వ్యక్తి ఉండి లైసెన్స్ ఉంటే వాహనం అప్పగించాలని తెలిపింది. ఎవరు రాకుంటే పోలీస్ స్టేషన్ కు తరలించాలని తెలిపింది.