తిరుపతిలో అగ్ని ప్రమాదం ..
మహారథానికి తప్పిన ప్రమాదం..
ప్రమాదానికి గల కారణాలు తెలియల్సివుంది..
తిరుపతి యదార్థవాది ప్రతినిది
తిరుపతి రైల్వే స్టేషన్, గోవిందరాజు స్వామి ఆలయ సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ వర్క్స్‌లో పెను అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలకు మూడంతస్తుల భవనం తగలబడిపోతోంది. భవనంలో అనేకమంది వర్కర్లు ఉండే అవకాశం ఉంది. ఫోటో ఫ్రేములు, ఫోటో చిత్రాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఎగసిపడుతున్న మంటల నేపథ్యంలో గోవిందరాజు స్వామి ఆలయ మహారథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తరలించారు.. మంటలకు 6ద్విచక్రవాహనాలు, కోటి వరకు ఆస్థి అగ్నికి అవుతి అయినట్లు తెలుస్తుంది. మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.