తెలంగాణనే అగ్రస్థానం..
* జాతీయ స్థాయిలో తెలంగాణ మళ్ళీ అగ్రస్థానంలో ఉంది..
* స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ 2023 ర్యాంకింగ్ లో..
* బారతదేశంలో టాప్ మూడు స్థానాలు తెలంగాణ జిల్లాలే..
* ట్విట్టర్ వేదికగా మంత్రి కే తారక రామారావు ప్రశంస..
స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ – డిసెంబర్ ర్యాంకింగ్ లో బారతదేశంలోనే మొదటి మూడు స్థానంలో తెలంగాణ జిల్లాలే ఉండటం ఏంటో ఆనందాన్నిచ్చిందని మంత్రి కే తారక రామారావు మంగళవారం రాత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. స్వచ్చ భారత్ మిషన్ (గ్రామీణ) 2023 డిసెంబర్ నెలలో పారామీటర్ల ఆధారంగా దేశం లోనే 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరి లో టాప్ 3 జిల్లాలు తెలంగాణ వే… తెలంగాణ మళ్ళీ అగ్రస్థానంలో నిలిచిందంటూ మంత్రి ట్వీట్ చేశారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయితీ శాఖ అధికారులు, సిబ్బందికి, రాజన్న సిరిసిల్ల,పెద్దపల్లి కరీంనగర్ జిల్లాల కలెక్టర్లకు మంత్రి ట్విట్టర్ వేదికగా గురువారం శుభాకాంక్షలు తెలిపారు.






