30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణతెలంగాణలో అన్నిమతాలు సమానమే..

తెలంగాణలో అన్నిమతాలు సమానమే..

తెలంగాణలో అన్నిమతాలు సమానమే..
గజ్వేల్ 19 డిసెంబరు 2022
నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ క్రైస్తవ భవన్ లో సోమవారం క్రిస్మస్ పండగా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రైస్తవులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు బట్టలు పంపిణీ చేశారు. అన్నీ మతాలు సమానమని, అందరూ సంతోషంగా ఉండాలని, పేదలకు సాయం చేసేందుకు కులం, మతం అడ్డుకారాదనేదే సీఎం కేసీఆర్ సంకల్పం అని, ప్రభుత్వ పరంగా ఘనంగా జరుపుతున్నారని, మీరంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కోరారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సోదర, సోదరీమణులకు విందు భోజనం నిర్వహించారు. ప్రపంచంలో అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అని, డిసెంబరు నెల క్రైస్తవులకు పవిత్ర క్రిస్మస్ మాసం అన్నారు. అనంతరం 40 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా లైబ్రరీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, గడ ముత్యం రెడ్డి, క్రైస్తవ ప్రతినిధులు-ఫాస్టర్స్ రూబెన్, మాణిక్ రావు, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్