తెలంగాణ లో గర్భిణీలకు వరంగా మరో అద్భుతమైన పథకం…
తొమ్మిది జిల్లాలోని సుమారు 1.25 లక్షల మంది గర్భిణీలకు ఉపయోగపడే విధంగా కేసిఆర్ న్యూట్రిషన్ కిట్లు నేటి నుంచి పంపిణీ ,ఆయా జిల్లాలో జరిగే కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రులు ప్రజాప్రతినిధులు
కామారెడ్డి కలెక్టరేట్ నుంచి ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తో కలిసి వర్చువల్ మోడ్ లో ప్రారంభిస్తారు, ఇదే సమయంలో మిగతా 8 జిల్లాలలో జరిగే కార్యక్రమంలో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. అత్యధికంగా రక్తహీనత ప్రభావం ఉన్న తొమ్మిది జిల్లాలు కొమరం భీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్, అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, లలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది.