అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర బోస్టన్లో దుర్ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి నిర్వహించిన మ్యూజిక్ షో లో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గాయపడ్డారు. వీరిలో 11 మంది కార్డియాక్ అరెస్ట్ ఎదుర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆస్ట్రో వరల్డ్ పేరుతో ప్రముఖ ట్రావెల్స్ నిర్వహించిన ఈ షోకు సుమారు 50 వేల మంది వచ్చి ఉంటారని ఒక అంచనా.