దేశంలోనే అతి పెద్ద ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట.
యదార్థవాది
మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ లో ఈ నెల 18న అవిస్కృతం కానున్న దేశంలోనే అతి పెద్దదైన 108 అడుగుల ఆది శంకరాచార్యుల బహుళ లోహ విగ్రహం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని శ్రీశ్రీశ్రీ భవాని స్వామి (ఓం అభాల సిద్ద పీఠాధిపతి శ్రీశైలం) కి ఆహ్వానం అందినట్లు ఆయన శిష్య బృందం శనివారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నూతన భారతదేశంలో ధర్మ పవిత్రమైన నర్మదానది ఒడ్డున నెలకొన్న ఓం కాళేశ్వర క్షేత్రంలో ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్టకు మర్మ కళ నిపుణులు, అను వంశిక ఆయుర్వేద వైద్యులు, ఓం శ్రీ భాలసిద్ధి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భవాని స్వామి స్వామీజీకి ఆహ్వానం రావడం గొప్ప విషయమని శిష్య బృందం తెలిపారు. కావున శంకరాచార్యులు, భవానీ స్వామి భక్తులు అందరూ ఈ విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొనాలని శిష్య బృందం పిలుపునిచ్చారు.
