27.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణనకిలీ విత్తనాలు జిల్లాలో లేకుండా రూపుమాపాలి

నకిలీ విత్తనాలు జిల్లాలో లేకుండా రూపుమాపాలి

నకిలీ విత్తనాలు జిల్లాలో లేకుండా రూపుమాపాలి

సిద్ధిపేట యదార్థవాది

వ్యవసాయ పోలీస్ అధికారులతో నకిలీ విత్తనాలు, పెస్టిసైడ్స్ సీడ్స్ పై పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ తో సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు… ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు పురుగుల మందులు కట్టడికి జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని మండల స్థాయిలో మండల అగ్రికల్చర్ అధికారి సబ్ ఇన్స్పెక్టర్ ఇరువురు సమన్వయంతో విధులు నిర్వహించాలని ప్రతి గ్రామం నుండి నకిలీ విత్తనాలు పురుగుల మందుల పై ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా రైతులతో సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు. నకిలీ విత్తనాలు కలిగి ఉన్నా అమ్మిన వ్యక్తుల పై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని అన్నారు.. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్, సిద్దిపేట ఏసిపి దేవారెడ్డి, గజ్వేల్ ఏసిపి రమేష్, గజ్వేల్ సిఐ వీరా ప్రసాద్ ఎస్ఐలు, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ అధికారులు అనిల్ కుమార్, బాబు, మహేష్, పద్మ, రాధిక,జిల్లాలోని మండలాల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్