నాడు వ్యవసాయం దండగ అన్ననేడు..రైతేరాజు..
వ్యవసాయం దండగ అన్న..నేడు పండగ చేసి రైతు రాజ్యమే అన్న ఏకైక నినాదంతో టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చి, రైతు సర్కార్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన సందర్భంగా శుక్రవారం జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని యావత్ రైతులందరికీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.కేంద్రంలోని బిజెపి సర్కార్ దిగివచ్చే విధంగా నేడు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు ధర్నాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో మద్దతు పలికి దేశంలో రైతు రాజ్యం కోసం రైతులు టిఆర్ఎస్ పార్టీ వెంట నడవాలన్నారు.