నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి: అదనపు ఎస్.పి
మెదక్ యదార్థవాది ప్రతినిధి
జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ ఎస్.మహేందర్ అన్నారు. మెదక్ జిల్లా నూతన పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్బంగా జిల్లా పరిధిలో స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ క్రైమ్ షీ టీమ్స్‌తో పాటు పెట్రోలింగ్ విభాగాలకు చెందిన పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిమని ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు ఆర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాల్సి వుంటుందని ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఎర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవడంతో పాటు వేడుకలు నిర్వహించుకునే ప్రాంతంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని కార్యక్రమాల నిర్వహణ ప్రదేశంలో తప్పనిసరిగా సిసి కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరీటీ సిబ్బంది ఎర్పాటు చేసుకోవాల్సి వుంటుందని వేడుకలు జరిగే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఇండ్ల వారికి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని వేడుకల్లో ఎలాంటి మత్తు పదార్థాల వినియోగించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ప్రధానంగా వేడుకల వేళ యువకలు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురి అవుతారని డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో పోలీసులకు చిక్కితే జరిమానతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని వేగంగా వాహనాలు నడపడం రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురిచేసే వ్యవహరిస్తే సదరు వాహనదారులకు చట్టపరమైన తిప్పలు తప్పవని అలాగే గ్రామీణా ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనీఖీలు నిర్వహించబడుతాయని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోబడుతుందని పై అంక్షలను ఎవరైన అతిక్రమించిన ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 కి కానీ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెం 871265888 నంబర్‌కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని పత్రిక ప్రటకనలో తెలిపారు.