నేటితో ముగియనున్న నాగోబా జాతర.. స్వగ్రామాలకు మెస్రం వంశీయులు..
యదార్థవాది ప్రతినిధి ఆదిలాబాద్
ఆదీవాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే నాగోబా జాతర నేటితో ముగియనుంది. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర ఇవాళ ముగియనుంది..పంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో నాగోబా జాతర ఒకటి. ఈనెల 21న ఈజాతరకు మెస్రం వంశీయులు గంగాజలాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని ఆదివాసులంతా జాతరకు వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈజాతర వారం రోజుల పాటు ఇక్కడే ఉండి సంప్రదాయం ప్రకారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఇంద్రవెల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఎడ్ల బండ్లలో వచ్చిన వారు తమ ఎడ్ల బండ్లను తీసుకొని నేడు జాతర ముగియడంతో తమ స్వగ్రామానికి బయలుదేరారు..