నేషనల్ యూనిటీ 2023 అవార్డు..
అడ్వకేట్ జి. లక్ష్మణ్ కుమార్‌కు నేషనల్ యూనిటీ 2023 అవార్డు
మెదక్: యదార్థవాది ప్రతినిది
ప్రముఖ న్యాయవాదిగా మెదక్ జిల్లా ప్రజల గుర్తింపు పొందిన లక్ష్మణ్ కుమార్ వృత్తిపరమైన సేవలతో పాటు సామాజికంగానూ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నట్లు తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ ఎం. రాజనారాయణ్ అన్నారు.. మెదక్ పట్టణానికి చెందిన అడ్వకేట్ జి. లక్ష్మణ్ కుమార్‌ను తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరమ్ (టీఐఎఫ్) నేషనల్ యూనిటీ అవార్డుకు ఎంపిక చేసింది. సామాజిక సేవా సంస్థ అయిన టీఐఎఫ్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుపుకునే నేషనల్ యూత్ డే కార్యక్రమంలో లక్ష్మణ్ కుమార్‌కు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. గురువారం హైదరాబాద్ బొగ్గులకుంటలోని ఆంధ్ర సారస్వత పరిషత్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ జి. చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులకు జాతీయ ఐక్యతా అవార్డులతో పాటు సామాజిక రంగంలో ఉత్తమ సేవలు అందించిన యువతకు యూత్ అవార్డ్స్ కూడా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగానే న్యాయ సేవలు అందించడానికి లక్ష్మణ్ ఎప్పుడూ ముందుంటారని సమాజంలోని పేద వర్గాలకు అండగా ఉండే వివిధ సంస్థలకు ఆయన వీలైనంత ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తుంటారని తన చుట్టూ ఉన్న సమాజానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకునే లక్ష్మణ్ కుమార్‌కు ఈ అవార్డు లభించడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మెదక్ న్యాయవాదుల సంఘం తెలిపింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అవార్డుకు ఎంపిక కావడం తనకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రేరణ ఇచ్చిందని ఈ పురస్కారంతో నా బాధ్యత మరింత పెరుగుతుంది అని అన్నారు.