పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా అక్రమ కేసులు
నేడు ప్రశ్నించే జర్నలిస్టుల పరిస్థితి ప్రశ్నార్థకం
తిరుపతి యదార్థవాది ప్రతినిది
నేడు సమాజంలో ప్రశ్నించే గొంతుకులను అధికారంతో అక్రమ కేసులు బాణాయించి నొక్కే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని, ఐక్యత లోపంతోనే ఇలాంటి అక్రమ కేసులు జర్నలిస్టులపై కూడా పెడుతున్నారని పౌరుల హక్కుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్, న్యాయవాది క్రాంతి చైతన్య అభిప్రాయపడ్డారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల శశి కుమార్ అనే జర్నలిస్టుపై అక్రమ కేసు బనాయించి అనారోగ్యంగా ఉన్నాడని తెలిసినా శశిని రిమాండ్ కు తరలించారని, ఆ మనోవేదనతోనే శశి తనువు చాలించాడన్నారు టిటిడి లోపాలను ఎత్తి చూపుతూ వార్తల ప్రచురణ చేసిన కోలా లక్ష్మీపతి అనే సీనియర్ జర్నలిస్టుపై కూడా కేసులు పెట్టారని గుర్తు చేశారు. శ్రీ వారి ఆలయం ముందు వేసిన పందిళ్లను అద్దెలకు కాకుండా శాశ్వత పందిళ్లను ఏర్పాటు చేయాలని మేలు అనడం తప్పా? అని ప్రశ్నించారు. హోటల్ అద్దెకు తీసుకున్న ప్రైవేటు వ్యక్తి టిటిడి కి చెల్లించాల్సిన కోట్ల రూపాయలను ఎగ్గొట్టి వెళ్లిపోతే ఆ డబ్బును టీటీడీ నష్టపోకుండా రికవరీ చేయాలని వార్తలు రాయడం నేరమా అని క్రాంతి చైతన్య నిలదీశారు. ఈ అంశాలపై వార్తలు రాయడం కారణంగా టిటిడి కి ఏ విధంగా పరువు నష్టం జరిగిందో ఆలోచించాలన్నారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అనేకమంది ప్రజాప్రతినిధులపై వారు చేస్తున్న విధానాలపై ఎన్నో కథనాలు జర్నలిస్టులు రాస్తుంటారని ఇలాంటి వాటిపై వారు కనుక కక్ష సాధింపు ధరణి ఏర్పరచుకుని ఉంటే సమాజం ఏ పరిస్థితుల్లో ఉండేదో ఆలోచించాలన్నారు ప్రస్తుతం మాచర్ల శ్రీనివాసులు అనే జర్నలిస్టుపై కూడా గంజాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నాడని అక్రమ కేసును పెట్టారన్నారు. వాస్తవానికి మాచర్ల శ్రీను తిరుమలలో భక్తులకు జరుగుతున్న అసౌకర్యాలను సంబంధిత ఉన్నతాధికారికి సమాచారం మాత్రమే ఇచ్చారని, ఆ విషయాలను ఎక్కడ పత్రికల్లో ముద్రించలేదని తెలిపారు. తనపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు పెట్టడానికి టిటిడి విజిలెన్స్, తిరుమల టూ టౌన్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని మాచర్ల శ్రీను తమకు సమాచారం అందించారని ఈ సందర్భంగా క్రాంతి కుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే శీనుపై సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో గంజాయి అక్రమ రవాణకు సహకరిస్తున్నాడని కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు తరలించారన్నారు ఈ విషయాలను గమనిస్తుంటే సమాజంలో ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కే ప్రయత్నాలు అధికారంను అడ్డుపెట్టుకొని చేస్తున్నారన్న వాస్తవాలు తేటతెల్లమవుతున్నాయన్నారు శీను అరెస్టులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిబిఆర్ హాస్పిటల్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా నమోదు చేశారని, వాస్తవానికి మాచర్ల శ్రీనివాసులు నివాసం ఉంటున్న సుబ్బారెడ్డి నగర్ లో తన ఇంటి వద్ద నుండి పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతున్న సీసీ ఫుటేజ్లు తమ వద్ద ఉన్నాయని తెలిపారు ఇలా పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా అక్రమ కేసులు పెట్టి జర్నలిస్టులలో ఐక్యతను దెబ్బతీసే విధంగా పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం సభ్యులు హేమాద్రి, అడ్వకేట్లు రవీంద్రనాథ్, వాసుదేవ్ పాల్గొన్నారు.