20.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణపరిశ్రమలు పట్టుకొమ్మలు: జిల్లా కలెక్టర్

పరిశ్రమలు పట్టుకొమ్మలు: జిల్లా కలెక్టర్

పరిశ్రమలు పట్టుకొమ్మలు: జిల్లా కలెక్టర్

యదార్థవాది ప్రతినిధి మెదక్

తెలంగాణ పరిశ్రమలు నెలకొల్పులకు పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు… గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటుచేసిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ, ప్రధాన మంత్రి ఉపాధి హామీ పధకాలను అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి.ఎస్. ఐపాస్ క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, పరిశ్రమల నెలకొల్పనకు ఒక నెలలో అనుమతులు మంజూరు చేయాల్సి ఉండగా 9 దరఖాస్తులు వివిధ శాఖలలో ఉన్నాయని, ప్రధానంగా కాలుష్య నియంత్రణ మండలి, టి.ఎస్.ఐ.ఐ.సి., విద్యుత్, హెమ్.ఏం.డి.ఏ. డి.టి.సి.పి శాఖలలో క్లియరెన్స్, ఆమోదం పొందాల్సి ఉందని తెలిపారు. ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను కుణ్ణంగా పరిశీలించి పెండింగు లేకుండా క్లియరెన్స్ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా టి-ఫ్రైడ్ క్రింద 8 మంది ఎస్సి, 14 మంది ఎస్టీ, లబ్దిదారులకు 35 శాతం సబ్సిడీతో 60 లక్షల 73 వేల రూపాయల విలువ గల వాణిజ్య వాహనాలు లబ్ధిదారులకు అందించుటకు కమిటీ ఆమోదం తెలిపిందని కలెక్టర్ అన్నారు.జిల్లా పరిశ్రమల కేంద్రం, ఖాదీ బోర్డు, ఖాదీ కమీషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి హామీ పధకం క్రింద 75 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు స్వయం ఉపాధి పధకం క్రింద యూనిట్లు నెలకొల్పాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 51 యూనిట్లు మంజూరు చేశామని అన్నారు. మిగతే యూనిట్లు కూడా మార్చి లోగా గ్రౌండింగ్ అయ్యేలా బ్యాంకు అధికారులతో సమన్వయము చేసుకోవలని సూచించారు. ఈవిషయం లో బ్యాంకర్లు అర్హులైన లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు. స్వయం ఉపాధి పధకాల ద్వారా ఆర్థికంగా బలోపేతానికి ఉత్సాహవంతులైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి అధికంగా గుర్తించి పంపాలని అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కృష్ణ మూర్తి, ఖాదీ బోర్డు రీజినల్ అధికారి సంతోష్, ఖాదీ కమీషన్ నోడల్ అధికారి విష్ణుమూర్తి, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ గౌడ్, బిసి అభివృద్ధి అధికారి కేశూరం, హెచ్ .ఏం.డి.ఏ. ప్లానింగ్ అధికారి నీలిమ, టీఎస్ ఐ ఐ సి లయజం అధికారి నజీబ్ అహ్మద్, కాలుష్య నియంత్రణ మండలి గౌతమి, గ్రౌండ్ వాటర్ శాఖ లావణ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్