పోటీ పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు పలు రకాల నిబంధనలు ఉంటాయన్న విషయం తెలిసిందే అస్సాంలో ఓ విద్యార్థిని షార్ట్ వేసుకుని పరీక్ష రాయడానికి వచ్చిన యువతికి నిర్వాహకులు అడ్డు చెప్పడంతో తో ఆమె కర్టెన్ చుట్టుకొని పరీక్ష రాసింది. ఇదిలా ఉంటే రాజస్థాన్లోని ఓ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడానికి వచ్చిన యువతి విషయంలో స్లీవ్స్ ను ఓ పురుష సెక్యూరిటీ గార్డు కత్తిరించా డు సెక్యూరిటీ గార్డు చేసిన ఈ పనికి మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ అసలు ఏమి జరిగిందంటే రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష బుధవారం జరిగింది. దీంట్లో భాగంగా బికనీర్ లోని ఒక పరీక్షా కేంద్రనికి పరీక్ష రాయడానికి ఓ విద్యార్థిని రాగా ఆమెను లోపలికి పంపించే ముందు ఆమె వేసుకున్న డ్రెస్ పై అభ్యంతరం వచ్చింది. ఆమె పొడుగు చేతులు నా టాప్ వేసుకుని వచ్చింది దీంతో ఆమె ధరించిన టాప్ స్లీవ్స్ సెక్యూరిటీ గార్డ్ కత్తెరతో కత్తిరించాడు. ఇది కాస్త మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చిన ఈ ఘటనపై ఓ మహిళ స్పందిస్తూ వెంటనే మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీనిని పరిశీలించిన మహిళ కమిషన్ చైర్పర్సన్ రేఖ శర్మ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. పరీక్షా కేంద్రం వద్ద మహిళా అభ్యర్థుల ను తనిఖీ చేయడానికి మహిళలను ఎందుకు నియమించలేదని ప్రశ్నిస్తూ మహిళల గౌరవానికి భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాజస్థాన్ ప్రభుత్వం కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. రాజస్థాన్ అడ్మిన్ శ్రేటు సర్వీసెస్ ఫిలిం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పొడుగు చేతులు ఉన్న షర్టులు ధరించకూడదు చెప్పింది. ఈ క్రమంలో నిండు చేతులు ఉన్న టాప్ ధరించిన పరీక్షా కేంద్రాలకు వచ్చిన మహిళా అభ్యర్థుల స్లీవ్స్ ను కత్తెరతో కత్తిరించాడు. ఈ నిబంధన కేవలం మహిళా అభ్యర్థులకు కాకుండా మగవారికి కూడా వర్తింప చేసింది. దీంట్లో భాగంగా ఫుల్ హాండ్స్ వేసుకుని వచ్చిన అబ్బాయిలను కూడా అడ్డుకున్నారు. దీంతో వారు షీట్స్ తీసి పరీక్ష రాయాల్సి వచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి కానీ నీ పోటీ పరీక్షలు జరిగే అక్రమాలను అడ్డుకునేందుకు ఇది సరైన చర్య కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పరీక్ష రాసేందుకు వస్తే స్లీవ్స్ కత్తిరించిన సెక్యూరిటీ గార్డ్. మండిపడ్డ మహిళా కమిషన్..
RELATED ARTICLES