పర్యావరణానికి హనిచేస్తే కట్టినా చర్యలు..ఎస్పీ సింధూ
జగిత్యాల: 14 యదార్థవాది ప్రతినిది
* ప్రభుత్వ నిషేధిత మాంజా ఉపయోగిస్తే కట్టినా చర్యలు…
జగిత్యాల జిల్లాల్లో సంక్రాంతికి ఆకాశంలో గాలి పటలతో పాటు పక్షులను ఎగరనిదామని జిల్లా ఎస్పీ సింధూ శర్మ అన్నారు. గాలి పటాలు ఎగరడం కోసం వినియోగించే గాంజా పూత పూసిన నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి ముప్పని, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో చైనా మాంజా పూర్తిగా నిషేధించడం జరిగిందని, చైనా మాంజా నిల్వచేసిన, రవాణా చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సింధూ శర్మ తెలిపారు. జిల్లలో వున్నా అన్ని పోలిస్ స్టేషన్ పరిదిలో తనికిలు చేస్తున్నామని, ప్రజలు ఎవరైనా చైనా మాంజా నిల్వచేసిన, రవాణా చేసినట్లు సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లకు గాని డయల్ 100 గాని ఫోన్ చేసి తెలపాలని తెలిపారు.

