పిల్లలపై ఒత్తిడి చేయొద్దు. పరీక్ష పే చర్చలో ప్రధాని మోదీ..
పిల్లలపై ఒత్తిడి చేయొద్దు. పరీక్ష పై చర్చలో ప్రధాని మోదీ..
యదార్థవాది ప్రతినిధి ఢిల్లీ:
‘పరీక్ష పై చర్చ’ తనకు కూడా పరీక్ష అని, దేశంలోని కోట్లాదిమందివిద్యార్థులు తనపరీక్షకు హాజరవుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు.’పరీక్ష పే చర్చ’ నాకు పరీక్ష..దేశంలోని కోట్లాది మంది విద్యార్థులు నా పరీక్షకు హాజరవుతున్నారు.. ఈ పరీక్షను ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని ఢిల్లీ నుంచి ‘పరీక్ష పే చర్చ’ 6వ ఎడిషన్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషిస్తూ ప్రధాని మోదీ అన్నారు..తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ఆశించడం సహజమేనని.. అది కేవలం సోషల్ స్టేషస్ కాపాడుకోవడం కోసమే అయితే అది ప్రమాదకరమని మోదీ అన్నారు. సామాజిక ఒత్తిడి కారణంగా తమ పిల్లలను బాగా చదవాలంటూ ఒత్తిడి చేస్తే అది సమస్యగా మారుతుందన్నారు. తాము రాజకీయాల్లో ఉన్నామని.. ఇక్కడ విజయం కోసం భారీ ఒత్తిడి ఏర్పడుతుందన్నారు. మీరు సామర్థ్యంతో అంచనాలను సరిపోల్చాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధాని మోడీ సూచించారు. పిల్లలు ఆందోళన చెందవద్దని, పరీక్షల రోజుల్లో ఒత్తిడికి గురికాకుండా, ఉల్లాసంగా ఉండడంతో పాటు ఉత్తమమైన వాటిని వారికి అందించడానికి కృషి చేయాలని ఆయన కోరారు..