పి ఆర్ టి యు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
యదార్థవాది బ్యూరో
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం పి ఆర్ టి యు భవనంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని పలువురు ఉపాధ్యాయ, ఉపాధ్యాయురాళ్ళను సన్మానించి అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు చేసిన సేవలను కొనియాడారు.నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అవుతారని ఆయన అన్నారు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ఉన్నత స్థానాల్లో ఉన్న పలువురిని గుర్తుచేశారు.కలెక్టర్ సన్మానించినన వారిలో సీనియర్ ఉపాధ్యాయురాళ్లలో ఎన్. గంగమణి, ఈశ్వర్ మనోహర్ తదితర ఉపాధ్యాయులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, యం ఈ ఓ ఎల్లయ్య, పి ఆర్ టీయూ అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి కార్యదర్శి కుషాల్ పట్టణ అధ్యక్షుడు సంతోష్ మిగతా పి ఆర్ టి యు నాయకులు పాల్గొన్నారు





