పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ…
జగిత్యాల యదార్థవాది
తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ జగిత్యాల జిల్లా గురుకుల ఉపాధ్యాయ పోటీ పరీక్ష ఉచిత శిక్షణ..
బీ.సి.స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గురుకుల ఉపాధ్యాయ పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయి బాబా పత్రిక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ కొరకు జగిత్యాల జిల్లా కు అర్హులైన BC,SC,ST లకు చెందిన యువతి యువకులు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్స్ చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు చివరి తేది ఈ నెల 25-05-2023 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, సంప్రదించవలసిన వెబ్ సైట్. http://tsbcstudycircles.cgg.gov.in శిక్షణను పొందగోరే అభ్యర్థులు ఈ దిగువ సూచిoచిన అర్హతలు కలిగి ఉండవలెను.
1. అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయము రూపాయలు 5,00,000/- లోపు ఉండాలి.
2. గురుకులం పరీక్షకు సంబంధించి నియమాలకు అనుగుణముగా అభ్యర్ధుల విద్యార్హతలు ఉండాలి.
3. ప్రస్తుతం విద్యను అబ్యాసిస్తున్న అభ్యర్ధులు మరియు ఏదైన ప్రభుత్వ ఉద్యోగం లో ఉన్న వారు బి.సి స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణ కు అర్హులు కారు.
4. గురుకులం ఉచిత శిక్షణ కరీంనగర్ నందు నిర్వహించబడుతుందని తెలిపారు.
ఇతరవివరాల కొరకు సంప్రదిచ వలసిన
ఫోన్ నెంబర్ 0878-2268686, బీ.సి.స్టడీ సర్కిల్, కరీంనగర్ కార్యాలయంలో సంప్రదించలని తెలిపారు.