పోలీస్ రిక్రూట్మెంటు బోర్డు నియమావళి
పాటించాలి: కమీషనర్ ప్రవీణ్ కుమార్
నిజామాబాద్ యదార్థవాది
నిజామాబాద్ గిరిరాజు ప్రభుత్వ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియంలో గురువారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నాం 2 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంటు బోర్డు నియమావళి పరీక్షా కేంద్రాల ఛీఫ్ సూపరింటెంటులకు అబ్జర్వరులకు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు అవగాహణ కార్యక్రమం నిర్వహించిన
ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్, ప్రవీణ్ కుమార్… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 30న నిర్వహించబోయే కానిస్టేబుల్ పోస్టుల నియామక ఫైనల్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో మొత్తం 5285 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. మొత్తం 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందని ఈపరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారిని అభ్యర్థులు హాల్టికేటు మీద ఫోటో అంటించుకొని పరీక్ష కేంద్రానికి రావాలని బ్లూ లేదా బ్లాక్ బాల్పాయింటు పెన్ తీసుకొని రావాలని, ఎలాంటి గుర్తింపు కార్డులు తీసుకురాకూడదని, అన్నిపరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. రాత పరీక్షకు హాజరు అయ్యే అభ్యర్థుల గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని 9 గంటల నుండే అభ్యర్థులను పరీక్ష కేంద్ర ములోనికి అనుమతించడం జరుగుతుందని 10 గంటల తర్వాతా అభ్యర్థులకు 1 నిమిష మేము ఆలస్యం అయిన పరీక్ష కేంద్రములోనికి అనుమతించరని తెలిపారు. ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని అభ్యర్థులు గుర్తించాలని, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, అటువంటి మోసగాళ్ల సమాచారం పోలీసులకు తెలుపాలని అన్నారు. బస్టాండ్ వద్ద అభ్యర్థులకు పరీక్షకేంద్రాల రూట్ మ్యాప్ గుర్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం జరుగుతుందని అన్నారు. రాత పరీక్ష పూర్తిగా రీజినల్ కో-ఆర్డినేటర్ గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ పి.రామ్ మోహన్ రెడ్డి, నిజామాబాద్ నోడల్ ఆఫీసర్ అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్) జి. మధుసుదన్ రావు సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని ఎవరికి ఎలాంటి సందేహాలుఉన్నను వీరి దృష్టికి తీసుకు వచ్చి, వారి సందేహాలు నివృత్తి చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో
అదనపు డి.సి.పి ఎ.ఆర్ గిరిరాజు, అదనపు పోలీస్ కమీషనర్ అడ్మిన్ జి. మధుసుదన్ రావు, నిజామాబాద్ ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఎ.సి.పిలు ఎమ్. కిరణ్ కుమార్, ప్రభాకర్ రావు, కె.ఎమ్. కిరణ్ కుమార్, నారాయణ, అసిస్టెంటు ప్రొఫెసర్ కెమిస్ట్రీ విభాగం డా॥ ఎమ్. సునిత అదనపు రీజినల్ కో-ఆర్డినేటర్ డా|| కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు..