ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజల పక్షాన ఒక మెట్టు దిగుతా: ఎమ్మెల్యే హరీష్
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
రంగనాయక సాగర్ లోకి నీటి విడుదలతో మంత్రి ఉత్తమ్ కుమార్ కు రైతుల పక్షాన ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ అనంతగిరి రిజర్వాయర్ నుండి పంటకు రంగనాయక సాగర్ లోకి నీటిని విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు లెక ఆందోళన లో ఉన్న రైతుల పడుతున్న బాధను చూసి రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి స్వయంగా వినతి పత్రం అందించనని అందుకు అనుగుణంగా గురువారం అదికారులు రిజర్వాయర్ నుండి 3 రోజుల పాటు రంగనాయక సాగర్ లోకి నీటిని పంపింగ్ చేస్తాన్నారని దీనితో యాసంగి పంటకు త్వరలో కాలువల ద్వారా నీళ్లు అందనున్నాయన్నారు. అప్పుడైన ఇప్పుడైనా పదవి ఉన్న లేకున్నా ప్రభుత్వంలో ఉన్న లేక పోయిన ప్రజలకు ఏ కష్టం వచ్చింది అంటే ప్రజల పక్షాన ఒక మెట్టు దిగుతానని ఆయన అన్నారు.